Aishwarya Rajesh : భాగ్యం క్యారెక్టర్ గురించి ఐశ్వర్య రాజేశ్ రియాక్షన్

వెంకటేశ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మూవీ విశేషాల్ని పంచుకున్నారు. "సుడల్ వెబ్ సిరిస్ షూటింగ్ లో వున్నప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్ కి లుక్ టెస్ట్ చేయాలని అన్నారు. నేను చాలా సర్ ప్రైజ్ అయ్యాను. ఆయన సినిమాలన్నీ చూశాను. ఇందులో నా క్యారెక్టర్ కి ఒక యాస వుంది. ఆ యాసతో పాటు ఆ లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ డైలాగ్ ఇచ్చారు. రెండు లైన్స్ చెప్పగానే చాలని చెప్పి స్క్రిప్ట్ ని నరేట్ చేశారు. నరేషన్ లో పడిపడి నవ్వుకున్నాను. నా కెరీర్ లో ఇంత ఎంజాయ్ చేసి విన్న స్క్రిప్ట్ ఇదే. భాగ్యం క్యారెక్టర్ కోసం చాలా వెదికారు. ఆ పాత్ర నాకు దక్కడం ఆనందంగా వుంది." అని చెప్పారు. వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' రూపొందింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com