Pattudhala : ఓటీటీలోకి వచ్చేసిన అజిత్ పట్టుదల

Pattudhala :  ఓటీటీలోకి వచ్చేసిన అజిత్ పట్టుదల
X

కోలీవుడ్ హీరో అజిత్ నటించిన ‘పట్టుదల’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలోనూ ప్రసారమవుతోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. మాగిజ్ తిరుమనేని తెరకెక్కించిన ఈ మూవీలో త్రిష, రెజీనా, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

మరోవైపు, 'విడాముయర్చి' తర్వాత అజిత్, త్రిష కాంబోలో వస్తోన్న ఆరో మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఇప్పటివరకూ వీరు 5 సినిమాల్లో కలిసి నటించారు. 'కిరీదం', 'జి', 'గ్యాంబ్లర్' (తమిళంలో 'మంకత్తా'), 'ఎంతవాడుగాని' (తమిళంలో 'ఎన్నై ఆరిందాల్'), 'విడాముయ‌ర్చి' సినిమాల్లో ఈ జంట నటించి మెప్పించారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'ని తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రొడ్యూసర్లు. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 10న తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.

Tags

Next Story