Akanksha Singh : ఆకాంక్ష స్టన్నింగ్ లుక్స్.. అదిరిపోయిందిగా

Akanksha Singh : ఆకాంక్ష స్టన్నింగ్ లుక్స్.. అదిరిపోయిందిగా
X

సుమంత్ హీరోగా నటించిన 'మళ్లీ రావా' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఆకాంక్ష సింగ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఇందులో ఆకాంక్ష నటనకి మంచి మార్క్స్ పడ్డాయి. హిందీలో టీవీ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఆకాంక్ష సింగ్ నటిగా మంచి గుర్తింపు పొందింది. దేవదాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈబ్యూటీ పరంపర, మీట్ క్యూట్ లోనూ సందడి చేసింది. కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించిన ఈ యంగ్ బ్యూటీ ఫ్యాన్స్ ను మెప్పించింది. చాలా రోజుల తర్వాత.. ఆమె నటించిన 'షష్టిపూర్తి' సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతున్నది. కాగా.. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా కూడా అందాల ఆరబోతలో మాత్రం తగ్గట్లేదు ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులతో టచ్లోనే ఉంటోంది. లేటెస్ట్ గా రెడ్ అండ్వైట్ డ్రెస్సులో ఇన్స్టాలో ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆకాంక్ష స్టన్నింగ్ లుక్, బ్యూటిఫుల్ అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Tags

Next Story