Akhanda: 'అఖండ' సెన్సేషన్.. ఇంకా ఆ థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలు..

Akhanda: అఖండ సెన్సేషన్.. ఇంకా ఆ థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలు..
Akhanda: అఖండ విడుదలయినప్పుడు ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Akhanda: కమర్షియల్ సినిమాలతో హిట్లు కొట్టే సీనియర్ నటులలో బాలకృష్ణ ఒకరు. బాలయ్య మ్యానరిజంకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. జై బాలయ్య అనేది ఇప్పుడు ఒక ఎమోషన్‌లాగా మారిపోయింది. అయితే బాలయ్య హీరోగా తెరకెక్కిన చివరి చిత్రం 'అఖండ' ఇప్పటికీ పలుచోట్ల రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వెళ్తోంది. ఏకంగా 175 రోజులు థియేటర్‌లో నడిచిన సినిమాగా అఖండ నిలవనుంది.


అఖండ విడుదలయినప్పుడు ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఘోరాలు సైతం వచ్చి ఈ సినిమాను చూశారు. అఖండ తర్వాత పలు సినిమాలు విడుదలయినా కూడా దీని రన్‌ను ఆపలేకపోయారు. అలాగే సంక్రాంతి కానుకగా ఓటీటీలో అఖండ విడుదలయినా కూడా ఇంకా థియేటర్లలో నడుస్తుండడం విశేషం.


ముందుగా అఖండ 103 సెంటర్లలో 50 రోజులు ఆడింది. 20కు పైగా సెంటర్లలో అఖండ 100 రోజులు పూర్తిచేసుకుంది. కర్నూలులో 100 డేస్ సెలబ్రేషన్స్ కూడా చేశారు బాలయ్య ఫ్యాన్స్. సీడెడ్ అంటూ బాలయ్య క్రేజ్ మామూలుగా ఉండదు కాబట్టి అక్కడ 100 రోజులు ఆయన సినిమా ఆడడం అనేది మామూలు విషయంగా మారింది.


గుంటూరులోని చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో మాత్రం అఖండ ఇంకా నాలుగు షోలలో నడుస్తుండడం విశేషం. పైగా ప్రతీ షోకు ప్రేక్షకులు వస్తుండడంతో థియేటర్ యాజమాన్యం దీనిని 175 రోజులు నడిపే దిశగా అడుగులు వేస్తోంది. ఇంతకు ముందు సీడెడ్ ఏరియాలో బాలయ్య నటించిన 'లెజెండ్' కూడా ఇదే తరహాలో 100 రోజులు ఆడింది. ఇప్పుడు మళ్లీ ఆ క్రెడిట్ అఖండకే దక్కుతోంది.

Tags

Read MoreRead Less
Next Story