Akkineni Nagarjuna : హిట్ 3 కోసం అక్కినేని నాగార్జున వెయిట్

Akkineni Nagarjuna : హిట్ 3 కోసం అక్కినేని నాగార్జున వెయిట్
X

నాని, శైలేష్ కొలను కాంబోలో వస్తున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘హిట్ 3’ రేపు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొనడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర గ్యారెంటీ హిట్ అని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ చిత్రంతో మరో స్టార్ హీరోకు లింక్ ఉందనే వార్త సినీ సర్కి ల్స్ లో చక్కర్లు కొడుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున కూడా హిట్ 3 కోసం వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ సినిమా సక్సెస్ కావాలని ఆయన కూడా కోరుతున్నాడట. ఈ చిత్ర దర్శకుడు శైలేష్ కొలను తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అక్కినేని నాగార్జునకు ఓ కథ వినిపించాడట. అది నచ్చిన నాగ్, హిట్ 3 మూవీ ఎలా ఆడుతుందో చూసి నిర్ణయం తీసుకోనున్నాడని తెలుస్తోం ది. మరి నిజంగా నాగ్ శైలేష్తో సినిమా చేస్తాడా లేడా అనేది వేచి చూడాలి.

Tags

Next Story