Alia Bhatt : ఇన్ స్టాలో అలియా భట్ అరుదైన ఘనత

బాలీవుడ్ నటి, ఆర్ఆర్ఆర్ ఫేమ్ అలియా భట్ ఇన్ స్టాలో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావవంతమైన సినిమా నటుల జాబితాలో రెండో స్థానాన్ని సాధించింది. ఈ విషయాన్ని ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ హైప్ ఆడిటర్ నివేదిక వెల్లడించింది. హాలీవుడ్ దిగ్గజాలు డ్వేన్ జాన్సన్, జెన్నిఫర్ లోపెజ్ల ను అధిగమించి, జెండయా తర్వాత స్థానంలో ఆలియా నిలిచింది. ఇన్స్టాగ్రామ్లో 85 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో, అలియా భట్ ట్రెండ్ సెట్టర్ గా కొనసాగుతోంది. గంగూబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ వంటి చిత్రాల లో అలియా భట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మొదటి స్థానంలో సెలేనా మేరీ గోష్ట్ నిలిచింది. అలియా సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం తెలుగులో డార్లింగ్ హీరో ప్రభాస్ సరసన ఫౌజీ సినిమాలో నటిస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోం ది. ఇందులో అలియాభట్ ఓ యువరాణి పాత్రలో నటిస్తున్నట్లు టాక్ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com