Alia Bhatt : అలియా బర్త్ డే.. సెలబ్రేషన్స్ స్టార్ట్

బాలీవుడ్ నటి అలియా భట్ బర్త్ డే సెలబ్రేషన్స్ స్టార్టయ్యాయి. వాస్తవానికి అలియా భట్ బర్తే డే మార్చి 15వ తేదీ. అయితే ప్రీ బర్త్ డే సెలబ్రే షన్స్ నిర్వహించి ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నా రు అలియా. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు అలియాభట్, రణ్ బీర్ కపూర్. ఫొటోగ్రాఫర్లు, విలేకర్ల సమక్షంలో కేక్ కట్ చేసి వారందరితో సరదాగా గడిపారు. ఫ్లోర్ పై కూర్చొని గ్రూప్ ఫొటోలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. రణ్ బీర్ అలియాను సినీప్రియులు మెచ్చు కుంటున్నారు. రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ 'బ్రహ్మాస్త్ర' సిద్ధమవుతోందని చెప్పారు. ‘బ్రహ్మాస్త్ర 2'కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తార ని చెప్పారు. ఈ సీక్వెల్ మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పారు. రణ్బీర్ అలియా జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' 2022లో విడుదలై ప్రేక్షకుల ను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com