Priyanka Mohan : మొత్తానికి నా కల నెరవేరింది.. ప్రియాంక మోహన్

Priyanka Mohan : మొత్తానికి నా కల నెరవేరింది.. ప్రియాంక మోహన్
X

కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఓంధ్ కథే హెల్లా' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. 2019లో ‘నాని గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగు అభిమానులను పలకరించింది. తర్వాత 'శ్రీకారం', 'సరిపోదా శనివారం' వంటి సినిమాల్లోనూ మెప్పించింది. తన అందం, గ్లామర్, అద్భుతమైన నటనతో ఫ్యాన్స్ని కట్టిపడేసింది. ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ సరసన 'ఓజీ' మూవీ కూడా చేస్తుంది. సాహో ఫేమ్ సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పవర్ ఫుల్గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీని పాన్ ఇండియా చిత్రంగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే తాజాగా ప్రియాంక మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించిన విషయాలను షేర్చేసుకుంది. 'ఓజీ' షూటింగ్ కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉంది. త్వరలోనే సినిమా మీ ముందుకు వస్తుంది. పవన్ లాంటి స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల. మొత్తానికి అది నెరవేరింది. ఈ మూవీలో మీరు పవన్ కల్యాణ్ని ఒక కొత్త తరహాలో చూస్తారు' అంటూ పేర్కొంది. ఇక ఈ అమ్మడు చేసిన కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ రెట్టింపు హైప్ ని క్రియేట్ చేస్తోంది. మరోవైపు ఓజీ సినిమాని వచ్చే జూన్, జూలైలో రిలీజ్ చేసేందుకు మేకర్స్సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story