Bachchala Malli OTT : ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ 'బచ్చల మల్లి'

Bachchala Malli OTT : ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ బచ్చల మల్లి
X

అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చలమల్లి’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుబ్బు మంగదేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత నెల 20న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. నరేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

హరితేజ, రావు రమేశ్, సాయి కుమార్, రోహిణి, ధన రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ సినిమాను నిర్మించారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరించారు. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అల్లరి నరేష్ నటనకు కూడా మంచి పేరొచ్చింది. అయితే అప్పటికే రిలీజైన పుష్ప 2 ప్రభంజనంలో బచ్చల మల్లి సినిమా లాంగ్ రన్ ను కొనసాగించలేకపోయింది.

చిన్నప్పటి నుంచి ఎంతో చురుకైన బచ్చల మల్లికి తండ్రి అంటే ఎంతో ఇష్టం. అయితే, తండ్రి తీసుకున్న ఓ నిర్ణయంతో బచ్చల మల్లి చిన్న వయసులోనే చెడు దారి పడతాడు. కాలేజీ చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి ట్రాక్టర్ నడుపుతుంటాడు. గొడవల్లో దూరుతుంటాడు. ఈ క్రమంలో అతడి జీవితంలోకి కావేరి (అమృత అయ్యర్) ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ మూవీ కథ.

Tags

Next Story