Allu Aravind : ఈడీ విచారణపై అల్లు అరవింద్ స్పందన.. ఏమన్నారంటే..?

ఈడీ విచారణపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. 2017లో ఓ ప్రాపర్టీలో ఒక వాటాదారుడి భాగాన్ని తాను కొనుగోలు చేశానని చెప్పారు. అయితే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఈడీ కి కొన్ని సమస్యలు ఉన్నాయని .. సదరు వాటాదారుడు బ్యాంకు నుంచి రుణం తీసుకొని చెల్లించలేదని అన్నారు. అకౌంట్స్ బుక్‌లో తన పేరు ఉండటం వల్ల ఈడీ విచారణకు పిలిచిందని.. అధికారుల ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చానని అరవింద్ తెలిపారు.
కాగా రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు అరవింద్ ను 3 గంటలపాటు ప్రశ్నించారు. 2017-19 మధ్య రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ ,రామకృష్ణ టెలిట్రానిక్స్ అనే రెండు సంస్థలు కలిసి యూనియన్ బ్యాంక్ నుండి రూ.101 కోట్ల రుణం తీసుకున్నాయని, ఈ ఆర్థిక లావాదేవీలలో అల్లు అరవింద్‌కు సంబంధించిన సంస్థలకు సంబంధం ఉందని ఈడీ అనుమానిస్తోంది. ఈడీ అధికారులు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతో అల్లు అరవింద్‌కు చెందిన సంస్థల మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను గుర్తించారు. అల్లు అరవింద్‌ను ఈ కుంభకోణానికి సంబంధించి పలు ప్రశ్నలు వేసి, సుమారు మూడు గంటల పాటు విచారించినట్లు సమాచారం. వచ్చే వారం మళ్ళీ విచారణకు రావాలని ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com