Allu Arjun : పీరియాడికల్ కథలో అల్లు అర్జున్

సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబో ఒకటి. వీరి కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. తాజాగా ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ‘పుష్ప-2’ రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి ఫిల్మ్‌సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. పీరియాడిక్ కథాంశంతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, బన్నీకి ఉన్న గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సబ్జెక్ట్ విషయంలో త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెబుతున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com