Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లీతోనే!

'పుష్ప2' సినిమాతో భారీ విజయం అందుకున్న అల్లు అర్జున్ తదుపరి సినిమా ఎవరిది అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన 'తదుపరి సినిమాను త్రివిక్రమ్తో చేస్తారని కొంతకాలంగా వినిపిస్తోంది. మాస్ కమర్షియల్ సినిమా తర్వాత వినోదాత్మక చిత్రం చేయడానికి హీరోలు మొగ్గుచూపుతారు. ఆ విధంగా త్రివిక్రమ్ సినిమా ఉంటుందని భావించినప్పటికీ, తాజాగా తమిళ దర్శకుడు అట్లితో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. వరుసగా మూడు హిట్స్, బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ తో జవాన్ వంటి హిట్ సినిమాను ఆయన ఇచ్చారు. కమర్షియల్ లైన్ తప్పకుండా సినిమాలు తీస్తారనే పేరుంది. అందుకే అట్లీతో సినిమా చేయనున్నారని టాక్. ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం అంచనాలు భారీగా ఉంటాయి. అల్లు అర్జున్ పుష్ప 2తో దాదాపు రెండు వేల కోట్ల కలెక్షన్స్ సాధించారు. అట్లీ జవాన్ సినిమా దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూలు సాధించింది. వీరిద్దరు కలిస్తే ఎన్ని వేల కోట్ల సినిమా అవుతుంది? అని అంచనా వేస్తున్నారు. తమిళంలో వరుస విజయాలతో ఎదుగుతున్న హీరో శివకార్తికేయన్ తో అట్లీ సినిమా కమిట్మెంట్ ఉందట. ప్రస్తుతానికి హీరో నుండి, దర్శకుడి నుండి సస్పెన్స్ కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com