Allu Arjun: త్వరలోనే ఒకే వేదికపై మెరవనున్న బన్నీ, ప్రభాస్.. ఎప్పుడంటే..

Allu Arjun: సినీ పరిశ్రమలో దాదాపు హీరోలందరూ ఫ్రెండ్స్‌లాగానే ఉంటారు. ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు కలిసిన ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఒకరి సినిమా హిట్ అవ్వాలని మరొకరు కోరుకుంటారు. సినిమా ప్రీమియర్ షోలకు వెళ్లి దానిని ప్రమోట్ చేస్తారు కూడా. అయితే టాలీవుడ్‌లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లలో అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఒకరు. అయితే తాజాగా వీరిద్దరు ఒకే వేదికపై మెరవనున్నారని రూమర్స్ మొదలయ్యాయి.
టాలీవుడ్ హీరోలు ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పడానికి మరో ఉదాహరణే ప్రీ రిలీజ్ ఈవెంట్స్. ఒక హీరో మరో హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు వెళ్తూ వారికి సపోర్ట్ చేస్తుంటారు. ఇటీవల అల్లు అర్జున్ కూడా చాలా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కే అటెండ్ అయ్యారు. 'పుష్పక విమానం' దగ్గర నుండి 'అఖండ' వరకు అన్ని ఈవెంట్స్‌కు ఛీఫ్ గెస్ట్‌గా వెళ్లారు. మరి తన సినిమా 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎవరు ఛీఫ్ గెస్ట్‌గా వస్తారా అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'పుష్ప' సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. అందుకే ఆ అంచనాలను అదే రేంజ్‌లో ఉంచాలని ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్. అయితే పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను ఆహ్వానించాలని మూవీ టీమ్ ఆలోచిస్తోందట. అయితే బన్నీకి, ప్రభాస్‌కు ఉన్న సాన్నిహిత్యం వల్ల తాను కూడా ఈ ఇన్విటేషన్‌ను యాక్సెప్ట్ చేస్తాడేమో అని నెటిజన్లు అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com