Amala Paul : ఆ క్యారెక్టర్ తో చాలా ఇబ్బంది పడ్డా.. అమలాపాల్ సంచలనం

Amala Paul : ఆ క్యారెక్టర్ తో చాలా ఇబ్బంది పడ్డా.. అమలాపాల్ సంచలనం
X

తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు చేసి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న అమలాపాల్.. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ రాణిస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్లు, పర్సనల్ ఎక్స్పీరియెన్స్ గురించి రీసెంట్ గా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. 'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకేమీ తెలీదు. ఏ విషయంపై ఎలాంటి అవగాహన లేదు. లైఫ్ లో ఎదురైన ఎదురుదెబ్బల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్న. నా కెరీర్ మొదట్లో చేసిన సింధు సమవేలి సినిమా వల్ల చాలా వ్యతిరేకతను మూటగట్టుకున్న. ఇది ఎంతగానో భయపెట్టింది. తండ్రి వయసున్న మామతో వివాహేతర సంబంధం పెట్టుకునే కోడలి పాత్రలో నటించాల్సి వచ్చింది. ఆ మూవీ చూశాక నా తండ్రి చాలాబాధ పడ్డారు. సింధు సమవేలి చేస్తున్నప్పుడు నా వయస్సు 17 ఏండ్లే అవడంతో ఆ పాత్ర సమాజంపై ఎలాంటి ముద్ర వేస్తుంది, ఆడియన్స్ నా పాత్రను ఒప్పు కుంటారా లేదా అనేది నాకు అర్థమవ్వలేదు. ఈ క్యారెక్టర్నా కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిందో సినిమా రిలీజయ్యాకే తెలిసింది. డైరె క్టర్ చెప్పింది గుడ్డిగా ఫాలో అవడం వల్లే మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డా. నటి ఎప్పుడైనా సవాళ్లను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి ’అని అమలాపా ల్ పేర్కొంది.

Tags

Next Story