OTT : ఓటీటీలోకి అమరన్ వచ్చేసింది

X
By - Manikanta |6 Dec 2024 2:00 PM IST
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’. ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. దాదాపు రూ. 150 కోట్లు భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచి.. కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈ సినిమా డిజిస్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించింది. ‘ నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో భాషల్లో అందుబాటులో ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com