ఓటీటీలోకి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.. ఎప్పుడు, ఎక్కడ..?

ఓటీటీలోకి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.. ఎప్పుడు, ఎక్కడ..?

సుహాస్‍ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. దుష్యంత్ కటికనేని దర్శకుడు.. ఈ మూవీని విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ సినిమాను మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, GA2 పిక్చర్స్, బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సుహాస్ సరసన శివాని నగరం కథానాయికగా నటించింది. గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్, స్వర్ణకాంత్, జగదీశ్ ప్రతాప్ బండారీ, నితిన్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు.

ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలోకి వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మార్చి 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఆహా ఈ మూవీ అఫీషియల్‍ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనుంది.అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రూ.8కోట్ల బడ్జెట్‍లోపే రూపొందింది.పాజిటివ్ టాక్ రావటంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ వచ్చింది. తొలి రోజే ఈ మూవీకి రూ.2.28కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తంగా ఏడు రోజుల్లో ఈ చిత్రం రూ.11.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Tags

Read MoreRead Less
Next Story