Amisha Patel : చెప్పకుండానే చేసేశారు..ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్పిన అమీషా
గతేడాది బాలీవుడ్ రిలీజ్ అయిన గదర్ 2 మూవీ ఎంతటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. 2001లో వచ్చిన 'గదర్ ఏక్ ప్రేమ్ కహానీ' మూవీకి సీక్వెల్ గా వచ్చిన మూవీలో బాలీవుడ్ హీరో సన్నీ దేవోల్, అమిషా పటేల్ జంటగా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీషా పటేల్ గదర్ 2 డైరెక్టర్ అనిల్ శర్మ గురించి ఓ ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్పారు. ‘ ఈ మూవీ క్లైమాక్సున్న అద్భుతంగా ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్ శర్మ. మొదట ప్రతి నాయకుడి పాత్రను నేనే చంపాలని చెప్పారు. కానీ, షూటికి వచ్చేసరికి అనిల్ సీన్ మార్చేశారు. ప్రతి నాయకుడి పాత్రను చరణ్ జీత్ చంపేలా క్రియేట్ చేశారు. షూట్ జరిగే వరకు దీని గురించి నాకు తెలియదు. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఏదేమైనా ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం సంతోషం' అంటూ అమీషా పటేల్ చెప్పుకొచ్చింది. కాగా ఈ బ్యూటీ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన 'బద్రి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత తెలుగులో మళ్లీ సినిమాలు చేయలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com