Amitabh Bachchan : జటాయువుగా అమితాబ్.. అంచనాలను పెంచేసిన రామాయణ

Amitabh Bachchan : జటాయువుగా అమితాబ్.. అంచనాలను పెంచేసిన రామాయణ
X

ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న రామాయణ సినిమాలో బిగ్ బీ అమితాబ్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఆయన జటాయువు పాత్ర చేస్తారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన వీడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో నటీనటుల వివరాలు ప్రకటించిన దగ్గరనుంచి సినీ ప్రముఖులు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఇందులో రావణుడి పాత్రలో యశ్ కనిపించనున్నారు. దీనిపై బాలీవుడ్ నటుడు, చిత్ర నిర్మాత రాజ్ బి శెట్టి తన అభిప్రాయాన్ని తెలిపారు. యశ్ ఎంపికపై రాజ్ తన ఇన్స్టాలో స్పందించారు. యశ్ ఆ పాత్రలో వందశాతం న్యాయం చేస్తారని పేర్కొన్నా రు. మహాభారతం ఆధారంగా ఇటీవల రూపొందిన 'కల్కి 2898 ఏడీ'లో అశ్వత్థామ పాత్రలో అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచారు బిగ్ బీ. ఇప్పుడాయన 'రామాయణ'లోనూ భాగమవుతున్నారని సమాచారం. ఇందులో జటాయువు పాత్రకు అమితాబ్ వాయిస్ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జటాయువు రామాయణంలో ఒక ధైర్యవంతుడైన పక్షి రాజు. రావణుడు సీతను అపహరించుకుపోతున్నప్పుడు అతనితో వీరోచితంగా పోరాడి ప్రాణాలను త్యాగం చేస్తాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ స్వయంగా జటాయువు పాత్రలో తెరపై కనిపిస్తారా లేదా కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తారా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా రానుండగా, అందులో మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.

Tags

Next Story