Amitabh Bachchan : ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. ఎన్ని కోట్ల లాభమంటే

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ అంధేరి ప్రాంతంలో ఉన్న ఓ ఫ్లాట్ ను అమ్మేశాడు. బిగ్ బీ ఈ ఇంటిని ఏప్రిల్ 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ నెల 17న విక్రయించారు. 5 వేల చదరపు విస్తీర్ణంలో ఉన్నఈ అపార్ట్మెంట్ దాదాపు ఆరు కార్లు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ లగ్జరీ ఫ్లాట్ ను విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్ రూ. 81 కోట్లకు కొనుగోలు చేశారు. బచ్చన్ ఈ ఇల్లు కోనుగోలు చేసినప్పటికీ ఇప్పటికీ 168 శాతం వాల్యూ పెరిగిందని చెబుతున్నారు. ఈ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీకి రూ.4.98 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీ రూ.30,000 అయిందని తెలిసింది. నవంబర్, 2021లో బచ్చన్ ఈ ఇంటిని హీరోయిన్ క్రితీస నను నెలకు 10 లక్షల రెంట్ సెక్యూ రిటీ డిపాజిట్ రూ. 60 లక్షలతో అద్దెకు ఇచ్చారు.
ముంబైలోని ఈ డూప్లెక్స్ అపార్ట్‌మెంటును అమితాబ్ బచ్చన్ 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ స్క్వేర్ యార్డ్స్ తెలిపింది. ఇప్పుడు దాన్ని రూ. 83 కోట్లకు విక్రయించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత విక్రయించి ఏకంగా రూ. 52 కోట్లు మేర లాభం అందుకున్నట్లు తెలుస్తోంది. ఇది కొనుగోలు ధరతో పోలిస్తే 168 శాతం అధికం. అపార్ట్‌మెంట్‌ని ఓ హీరోయిన్‌కు అద్దెకు ఇచ్చి సైతం భారీగానే రెంటు పొందినట్లు సమాచారం. ఈ అపార్ట్‌మెంట్ ట్రాన్సాక్షన్లలో స్టాంప్ డ్యూటీ కింద రూ. 4.98 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 30 వేలుగా ఉన్నట్లు సమాచారం.అమితాబ్ నాలుగేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com