Tollywood : ప్రిన్స్ సరసన ఇండోనేషియా బ్యూటీ?

Tollywood : ప్రిన్స్ సరసన ఇండోనేషియా బ్యూటీ?
X

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 పై ఎప్పటికప్పుడు అంచనాలు మారుతున్నాయి. ఈ సినిమాలో ఎవరూ ఊహించని ట్విస్టులెన్నో ఉంటున్నాయి. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తోంది. అయితే హీరోయిన్ గానా..? ఏదైనా కీలక పాత్రలో నటిస్తుందా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అయితే ఆమె మహేశ్ పక్కన హీరోయిన్ గా సెట్ కాదంటున్నారు మహేశ్ బాబు ఫ్యాన్స్. అదే సమయంలో పీసీ కీలక పాత్రలో నటించడం పక్కా అని కూడా అంటున్నారు. ఇదిలా ఉండగా హీరోయిన్ గా ఇండోనేషియాకు చెందిన బ్యూటీ నటిస్తుందనే టాక్ కూడా ఉంది. హైద రాబాద్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్న ప్రియాంక చోప్రా స్మాల్ బ్రేక్ ఇచ్చింది. తన సోదరుడి సిద్ధార్థ్ చోప్రా వివాహం కోసం విరామం తీసుకున్నట్లు సమాచారం. ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ముంబై వెళ్తున్న వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Tags

Next Story