Ananya Nagala : కనీస సంస్కారమైనా ఉండాలి : అనన్య నాగళ్ళ

నటి అనన్య నాగళ్ళ ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. ఈ విషయంలో ఆమెకు అన్ని వర్గాల నుండిప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు మరోసారి తాను చేసిన కామెంట్స్ గురించి చెప్పుకొచ్చారు అనన్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ "కొన్ని ప్రశ్నలకు మనం సంస్కారంతో ఆన్సర్ ఇవ్వాలి. అది ఎదుటివారికి ఉన్నా లేకున్నా సరే. ఆరోజు అదే నేను చేశాను. ఈ విషయంలో మీడియా నుండి సపోర్ట్ రావడం ఆనందం అనిపించింది. చాలా మంది ఆ రిపోర్టర్ అడిగినదానికి మేము సారీ చేపిస్తున్నామన్నారు. ఒక తెలుగు అమ్మాయికి ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది" అంటూ చెప్పుకొచ్చింది అనన్య. ప్రస్తుతం ఆమె నటిస్తున్న పొట్టేల్ సినిమా అక్టోబర్ 25న విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com