Ananya Panday : ఇంతలా మోసం చేస్తాడనుకోలేదు : అనన్య పాండే

Ananya Panday : ఇంతలా మోసం చేస్తాడనుకోలేదు : అనన్య పాండే
X

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన లైగర్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. కానీ ఆ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమా ఫెయిలయినా అనన్య పాండే మాత్రం తెలుగు ఆడియన్స్ కు మాత్రం బాగా దగ్గరయ్యారు. లైగర్ తర్వాత అనన్య మరో తెలుగు సినిమా చేయలేదు. మళ్లీ బాలీవుడ్ వైపే వెళ్లిపోయింది. అక్కడ ఆమెకు ఆఫర్లు బాగానే వస్తున్నాయి. రీసెంట్ గా ఆమె నటించిన సీటీఆర్ఎల్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ అందుకుంది. ఇదంతా బాగానే ఉన్నా.. అనన్య పాండేకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆమెను మోసం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఓ ఈవెంట్ కు వెళ్లిన అనన్యకు ఓ ఫాస్టర్ కనిపించాడు. భవిష్యత్తులో ఆమెకు 60 కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ వస్తుందని జోస్యం చెప్పాడు. ఆ మాటలను కాస్త అనన్య నమ్మేసింది. ఆమెతో పాటు మరో యంగ్ హీరోని కూడా 2026 వరకు పెద్ద హీరో అవుతాడని నమ్మించాడు. అయితే సినీ ఇండస్ట్రీలో టాక్ ఆమె షాక్ అయ్యారు. అతను వారిద్దరిని వాడుకొని అతను మత ప్రచారం చేసుకుంటున్నాడని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ప్రెజెంట్ ఈ వీడియో తెగ వైరలవుతోంది. దీనినిపై అనన్య పాండే తన మమ్మల్ని ఇంతలా మోసం చేస్తాడనుకోలేదని చెప్పుకొచ్చింది.

Tags

Next Story