Ananya Nagalla : పండుగ పూట మెరిసిపోయిన అనన్య

మల్లేశం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ పిల్ల అనన్య నాగళ్ల. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఈ అమ్ముడు టాలీవుడ్ లో ఇప్పటి వరకు 13 సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆమె నటించినతొలిసినిమా మల్లేశంలో పోషించిన పద్మ పాత్రకు సైమా అవార్డు వచ్చింది. వకీల్ సాబ్, మ్యాస్ట్రో, ప్లే బ్యాక్ వంటి అనేక చిత్రాలలో నటించింది. గతేడాది నవంబర్లో విడుదలైన అన్వేషిలో ప్రేక్షకులు ఆమెను ఆదరించారు. అనన్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. ఇన్ స్టాగ్రామ్ లో తన ఫొటోలనూ షేర్ చేస్తూ ఉంటుంది. భోగి పండుగను పురస్కరించుకొని పింక్, గ్రీన్ లో మెరిసిపోయిందీ భామ. గోల్డ్ కలర్ బార్డర్ తో ఆహ్లాదంగా పండుగను ఎంజాయ్ చేస్తున్నట్టు లుక్స్ ఇచ్చేసింది. ఆమె సారీకి జుంకాలు, నెక్లెస్ బాగా సెట్టయ్యాయి. తన ముఖాన్ని చక్కగా ఫ్రేమ్ చేయడానికి తన జుట్టును స్టైల్ చేసింది. తన క్యాప్షన్లో, ఆమె అందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపింది. అందరూ అనన్యకు హ్యాపీ భోగీ చెబుతున్నారు. మస్తు ఉన్నవ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పొట్టెల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి సినిమాలతో ఈ మధ్య అనన్య నాగళ్ళ థియేటర్లలోకి వచ్చారు. ప్రజెంట్ ఆవిడ చేతిలో మరో నాలుగైదు సినిమాలు ఉన్నాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com