Mega Movie : అనిల్ రావిపూడి మెగా వినోదం.. వచ్చే సంక్రాంతికే రిలీజ్

Mega Movie : అనిల్ రావిపూడి మెగా వినోదం.. వచ్చే సంక్రాంతికే రిలీజ్
X

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే యాక్షన్, కామెడీ, సాంగ్స్ ఇలా ఆల్ ఇన్ వన్ మాస్ ఎంటర్టైనర్. ఆయనతో మరోసారి వినోదం పంచేందుకు దర్శకులు అనీల్ రావిపూడి సిద్ధమవుతున్నారు. వరుస విజయాలతో దూకుడుగా ఉన్న అనీల్ ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సింగిల్ లాంగ్వేజీలో రూ.300 గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా అందించి ఆశ్చర్యపరిచారు. చిరంజీవితో అనీల్ చేయబోయే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ సిద్ధమైంది. చిరంజీవిని ఇంతవరకు చూడని పాత్రలో ఆవిష్కరించనున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై గోల్డ్ బాక్స్ సంస్థతో కలిసి సాహు గారపాటి నిర్మిస్తున్న చిత్రమిది. చిరంజీవి మాస్ అంశాలు, అనిల్ మార్క్ వినోదంతో కుటుంబకథా చిత్రంగా రూపొందనుంది. చిరు, అనిల్ కోసం అంతా సిద్ధమైంది. దర్శకుడు అనిల్ చిరంజీవికి ఫైనర్ నెరేషన్ వినిపించారు. ఆయన థ్రిల్ అయ్యారు. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగాస్టార్ ఆశీస్సులు లభించడంతో చిత్ర బృందంలో హుషారు కనిపిస్తోంది. సినిమా ప్రారంభానికి ముందే ఇతర తారాగణం ఎంపికచేస్తారని తెలిసింది.

ఈ సినిమాలో మెగాస్టార్ శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపిస్తారు. చిరు అసలు పేరు శివశంకర ప్రసాద్ అనే విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత చిరంజీవి పూర్తి ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తారని భావించవచ్చు. “చిరంజీవిగారికి శంకర ప్రసాద్ పాత్రని పరిచయం చేశా. ఆయనకు ఆ పాత్ర బాగా నచ్చింది. ఇంకెందుకు ఆలస్యం. మంచి ముహూర్తంతో 'చిరు' నవ్వుల పండుగబొమ్మకి శ్రీకారం" అని సోషల్ మీడియాలో అనిల్ పేర్కొన్నారు. సినిమాకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారు.

Tags

Next Story