Anjali : టైం వచ్చినప్పుడు పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన అంజలి

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ అంజలి. రీసెంట్ గా బహిష్కరణ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అంజలిది వేశ్యపాత్ర. కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో కూడా నటించింది. ఆ సీన్స్ షూట్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యిందట. ఆ టైంలో మేకర్స్ చాలా జాగ్రత్త పడ్డారని తెలిపింది. సెట్స్ లో ఉన్న అందరికీ బయటకు పంపి షూట్ చేశారని తెలిపింది. ఇప్పటి దాకా ఇలాంటి సీన్స్ ఎప్పుడూ చేయలేదని చెప్పింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ లో తాను చేసిన పాత్రకు అనుకున్నదాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని తెలిపింది. ప్రతి మూవీకి కూడా స్పెషల్ గా హోం వర్క్ కూడా చేస్తానని చెప్పింది. తాను చేసిన పలు చిత్రాల్లో పాత్రలు డిమాండ్ చేసినందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చేసుకుందట. తనకు సంబంధించి వచ్చే తప్పుడు వార్తలను చూసి వెంటనే మర్చిపోతానని తెలిపింది. వాటిని చదివినప్పుడు మాత్రం కాస్త బాధపడతానని చెప్పింది. టైమ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని అంటోందీ ముద్దుగుమ్మ. త్వరలో అంజలి.. గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సతీమణిగా అంజలి కనిపించనుందని టాక్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అంజలి కీలక పాత్ర పోషించారని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com