Anjali : రామ్ చరణ్ తో వర్క్ చేయడం నాకు గొప్పగా అనిపిస్తోంది !

Anjali : రామ్ చరణ్ తో వర్క్ చేయడం నాకు గొప్పగా అనిపిస్తోంది !
X

‘గేమ్ ఛేంజర్’ (Gamechanger) మూవీ ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో తొలిసారిగా శంకర్‌ (Shankar ) తో జతకట్టడం వల్ల సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దిల్ రాజు నిర్మాణంలో ఇది 50వ సినిమాగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇందులో రామ్ చరణ్ తొలిసారిగా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటి.

తండ్రి రామ్ చరణ్ పాత్రకు జోడీగా ఇందులో అంజలి (Anjali) కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెర్రీ భార్యగా ఆమెను చూపిస్తూ కొన్ని స్నాప్‌లు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్స్‌లో అంజలి కనిపిస్తుందని అందరూ అనుకుంటున్నారు.

తాజాగా.. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ హీరోయిన్ అంజలి తన పాత్ర గురించి పెద్దగా ప్రస్థావన తీసుకురాకుండా.. ఇది ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తుందని, రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం చాలా గొప్పగా అనిపించిందని మాత్రం చెప్పింది. ఇందులో సునీల్, శ్రీకాంత్, జయరాం, యస్.జే.సూర్య, సముద్రఖని ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నాడు. యంగ్ రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా కనిపించనుంది.

Tags

Next Story