Annu Kapoor : ప్రియాంక చోప్రా ముద్దు పెట్టలే : అన్నుకపూర్

బాలీవుడ్ నటుడు అన్నుకపూర్ సాత్ ఖాన్ మాఫ్ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనకు ముద్దు పె ట్టలేదని, ముద్దు సన్నివేశంలో సంకోచించిందని తెలిపారు. తాను ప్రధాన హీరో కాకపో వడం వల్లే ఆమె అయిష్టతను ప్రదర్శించిందన్నారు. హీరో యిన్స్ యువ నటులను ము ద్దుపెట్టుకోవడానికి ఇష్టపడతా రని, ఇతరులను కిస్ చేయడానికి మాత్రం ఆలోచిస్తారని చెప్పారు. తాను ప్రధాన హీరోగా ఉంటే ప్రియాంకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోయే దేమోనని అన్నారు. తనకు మంచి పర్సనాలిటీ, లుక్ లేదని అందుకే పీసీ వెనుకడుగు వేసిందన్నారు. 2011లో ప్రియాంక లీడ్ రోల్లో నటించిన చిత్రం సాత్ ఖూన్ మాఫ్. ఏడుగురు భర్తలున్న మహిళగా.. ఒకరి తర్వాత మరొకరిని చంపే పాత్రలో ఆమె నటించారు. ఈ చిత్రంలో ప్రియాంక ఐదో భర్తగా అన్నూ నటించాడు. వీళ్లిద్దరి మధ్య కొన్ని బోల్డ్ సన్నివేశాలుంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com