Tollywood : మరో అర్జున్ రెడ్డి .. నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సిద్దు జొన్నలగడ్డ హీరోగా ప్రస్తుతం జాక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 2025 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తరువాత సిద్దు అర్జున్ రెడ్డి టైపులో ఓ సినిమా చేస్తున్నాడట. ఈ ప్రాజెక్టు గురించి నిర్మాత నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "నేను సిద్దూ ఓ సినిమా చేయబోతున్నాం. అది ‘అర్జున్ రెడ్డి’ సినిమా లాంటిది. కథ సిద్ధం అవుతోంది. సిద్ధు ఆ సినిమా పై చాలా ఇంట్రస్ట్ గా ఉన్నాడు. ఈ సినిమాలో సిద్దూ చాలా కొత్తగా కనిపిస్తాడు. కానీ ఈ సినిమా రావడనికి చాలా టైమ్ పడుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సిద్ద చేయబోయే నెక్స్ట్ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com