Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుండి మ‌రో క్రేజీ అప్‌డేట్

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుండి మ‌రో క్రేజీ అప్‌డేట్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా 'హరి హర వీర మల్లు'. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎదయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్ డేట్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా తాజాగా కీరవాణి స్వరపరచిన 'తారా తారా - ది సిజ్లింగ్ సింగిల్' అనే లిరికల్ ట్రాక్ రిలీజ్ టైమ్ ను టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 28న ఉదయం 10:20 గంటలకు ఈ పూర్తి పాట విడుదల చేయనున్నట్లు తెలిపింది. నిధి అగర్వాల్ కి సంబంధిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Tags

Next Story