Prabhas Fouji : ప్రభాస్ మూవీలో రెండో హీరోయిన్ ఎవరు..?

Prabhas Fouji :   ప్రభాస్ మూవీలో రెండో హీరోయిన్ ఎవరు..?
X

డార్లింగ్ స్టార్ ప్రభాస్ దూకుడు పెంచాడు. తనలా ప్యాన్ ఇండియా మార్కెట్ ఉన్న ఏ హీరో లేనంత వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఇకపై యేడాదికి రెండు సినిమాలు చేయాలన్న టార్గెట్ తోనే దూసుకుపోతున్నాడు. సలార్ గత డిసెంబర్ లో విడుదలైంది. ఈయేడాది జూన్ లో కల్కి వచ్చింది. నెక్ట్స్ ఇయర్ కూడా రాజా సాబ్ 2025 ఏప్రిల్ 10న వస్తోంది. అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తోన్న ఫౌజీ( వర్కింగ్ టైటిల్) విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే 2025లో రెండు సినిమాలు దాదాపు కన్ఫార్మ్. ఇక రీసెంట్ గానే ఫౌజీ ఓపెనింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్నట్టు ప్రకటించారు. తన పేరు ఇమాన్వి. మంచి డ్యాన్సర్. తనను చూడగానే చాలామంది ఫిదా అయిపోయారు. భలే బ్యూటీని సెలెక్ట్ చేశాడు దర్శకుడు అనుకున్నారు. ఫస్ట్ మూవీతోనే ప్రభాస్ తో ప్యాన్ ఇండియా హీరోయిన్ అయ్యే జాక్ పాట్ కొట్టిన ఇమాన్విని చూసి ఇతర హీరోయిన్లు జెలసీ ఫీలయ్యారంటే అతిశయోక్తి కాదు.

1940స్ బ్యాక్ డ్రాప్ లో దేశ స్వాతంత్ర్య పోరాట నేపథ్యంతో పాటు సుభాష్ చంద్రబోస్ ప్రస్తావనలతో ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే చెప్పేశారు. సో.. ప్రభాస్ ను ఈ సారి బ్యాటిల్ ఫీల్డ్ లో చూడబోతున్నాం అన్నమాట. అయితే ఈ మూవీలో ఇమాన్వితో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందట. తన పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని టాక్. కాకపోతే అప్పుడే ఆ హీరోయిన్ ను పరిచయం చేయాలనుకోవడం లేదని టాక్. ఆ హీరోయిన్ ఇంటర్ డక్షన్ చాలామందిని ఆశ్చర్యపరుస్తుందనే మాటలూ వినిపిస్తున్నాయి. అలాగని తనేమీ ఇమాన్విలా కొత్త హీరోయిన్ కాదు. ఆల్రెడీ ప్రభాస్ తో బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించిన బ్యూటీనేనట. మరి ఆ బ్లాక్ బస్టర్ బ్యూటీ ఎవరై ఉంటారో గెస్ చేయండిక.

Tags

Next Story