Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మరో రీ రిలీజ్

Prabhas :  ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మరో రీ రిలీజ్
X

రీ రిలీజ్ ల ట్రెండ్ కాస్త పాతబడిపోయింది. వరుసగా వస్తోన్న సినిమాలతో ఆడియన్స్ తో పాటు అభిమానులు కూడా కాస్త విసిగిపోయారు అనేది నిజం. మహేష్ బాబు మురారి, ఖలేజా చిత్రాలను ఎగబడి చూసిన ఫ్యాన్స్ అతడు చిత్రాన్ని అసలు పట్టించుకోలేదు. పైగా అది మహేష్ బర్త్ డే రోజు రిలీజ్ అయింది. ఇక ప్రభాస్ నుంచి కూడా ఇప్పటికే కొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఆశించినంత గొప్ప రిజల్ట్ అయితే రాలేదు. అయినా మరో సినిమా వస్తోంది. విశేషం ఏంటంటే.. ఇది రిలీజ్ టైమ్ లోనే ఫ్లాప్. అలాంటి చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడం అంటే రిస్కే. అయినా చేస్తున్నారు అంటే అది హార్డ్ కోర్ ఫ్యాన్స్ పనే అని వేరే చెప్పాలా..?

ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ వర్షం. ఈ చిత్రాన్ని నిర్మించిన ఎమ్ఎస్ రాజు మరోసారి అతనితో చేసిన సినిమా పౌర్ణమి. ఇదే నిర్మాతతో దర్శకుడుగా పరిచయం అయిన ప్రభుదేవా నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన సినిమా పౌర్ణమి. దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలన్నీ క్లాసిక్ అనిపించుకున్నాయి. అయితే ఛత్రపతి వంటి వీరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తర్వాత వచ్చిన క్లాస్ మూవీ పౌర్ణమి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకూ పెద్దగా కనెక్ట్ కాలేదు. 90ల కాలం నాటి కథ, కథనాలతో కనిపించడం కూడా కొంత మైనస్ అయింది. త్రిష, ఛార్మీల పాత్రలు బావుంటాయి. ప్రభాస్ సైతం ఆ పాత్రను ఓన్ చేసుకుని సెటిల్డ్ గా నటించాడు. బట్ సినిమా పోయింది.

ఇలాంటి మూవీని మళ్లీ విడుదల చేయడానికి కారణాలేంటో కానీ ఈ నెల 19న పౌర్ణమిని మళ్లీ విడుదల చేస్తున్నారు. మర ఈ సారి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో కానీ.. అసలు ఆడియన్స్ ఈ మూవీ వైపు వస్తారా అనేదే పెద్ద ప్రశ్న.

Tags

Next Story