Yuvraj Singh Biopic : తెరపైకి మరో స్టార్ క్రికెటర్ బయోపిక్..

ఇండియన్ సినిమాలో క్రికెటర్ల బయోపిక్ లు కొత్తేమీ కాదు. గతంలో వచ్చిన ‘ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరకీ తెలిసిందే. 2021లో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ ‘83’సైతం ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు మరో మాజీ క్రికెటర్ బయోపిక్ సిల్వర్ స్క్రీన్ పై రానుంది. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్. టీ20 ఫస్ట్ వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఒక్క ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు.2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ ను టీమిండియా గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన యువీ.. కొత్త తరం ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. క్యాన్సర్ ను జయించి వ్యక్తిగతంగానూ స్ఫూర్తిదాయకంగా మారాడు.ఇప్పుడు అతడి లైఫ్ స్టోరీ సినిమాగా రానుంది.బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ యువీ బయోపిక్‌ను రూపొందించనుంది. నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ ఈ విషయాన్ని వెల్లడించారు. తొందరలోనే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com