RC 16 Update : ఆర్సీ 16 నుంచి మరో అప్డేట్
గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్, జాన్వీకపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఆర్సీ 16. ఈ సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. మీర్జాపూర్ సీరిస్ ఫేమ్ మున్నాభయ్యా దివ్యేందు ఈ మూవీలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బుచ్చిబాబు పోస్ట్ పెట్టాడు. మీర్జాపూర్ సిరీస్ లో అడల్ట్ డైలాగ్స్ తో మున్నా భయ్యాగా దివ్యేందు శర్మ బాగా వైరల్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నటుడికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. బాలీవుడ్ లో పలు సిరీస్ లు, సినిమాలతో మెప్పించిన దివ్యేందు ఇప్పుడు రామ్ చరణ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో దివ్యేందు శర్మ నెగిటివ్ రోల్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఏ ఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఇప్పటికే మూడు పాటలు కూడా కంపోజింగ్ అయిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com