Anupama : జానకి పాత్రలో అనుపమ

X
By - Manikanta |21 Dec 2024 1:00 PM IST
కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. యధార్థ సంఘటనల ఆధారంగా తెరెకెక్కిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ నారాయణ తెరకెక్కిస్తున్నాడు. కోర్టు రూమ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో అనుపమ జానకి పాత్రలో కనిపించనున్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి పోరాడే యువతీ జీవిత కథే ఈ సినిమా. జానకి కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రియల్ స్టోరీ కావడంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నారు. మరి విడుదల తరువాత ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com