Anushka Shetty : అనుష్క కమ్ బ్యాక్

Anushka Shetty : అనుష్క కమ్ బ్యాక్
X

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్, జేజెమ్మ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీలో నటించి స్టార్ గా ఎదిగిపోయింది. అయితే కొంతకాలంగా ఈ అమ్మడికి అవకాశాలు రావడంలేదు. చివరిగా నవీన్ పొలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాలో కనిపించింది. తాజాగా ఘాటీ అనే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. క్రిష్. జాగర్లమూడి డైరెక్షన్ లో సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో అనుష్క సీరియస్ గా భాంగ్ స్మోకింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీంతో మూవీపై ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతోంది. దీంతో మంచి హిట్టుతో అనుష్క కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

Tags

Next Story