Anushka : అనుష్క కొంటె చూపులకు 40 మందికి యాక్సిడెంట్స్

Anushka : అనుష్క కొంటె చూపులకు 40 మందికి యాక్సిడెంట్స్
X

వేదం సినిమా రిలీజై 15 ఏండ్లు పూర్తవుతోంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి వేశ్య పాత్రలో నటించారు. ఆమె కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిపోయిన సినిమాల్లో వేదం ఒకటి. ముఖ్యంగా తన అంద చందాలతో యువతను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం అనుష్కను స్టార్ గా నిలబెట్టింది. ఈ సందర్భంగా దర్శకు డు క్రిష్ అప్పటి సంఘటనలు కూడా గుర్తు చేసుకున్నారు. అనుష్క ధరించిన పసుపు రంగు చీర స్టిల్స్ ని ప్రమోషన్స్ లో బాగా ఉపయోగించా రు. ఆమె చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తూ మత్తెక్కించే చూపులతో యువతను బాగా ఆకట్టుకుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారట. అది చూడగానే ఆకట్టుకునేలా ఉండటం, అనుష్క కొత్తలుక్, అందులోనూ మత్తెక్కించే చూపులతో కవ్వించడంతో ఆ హోర్డింగ్ హైలెట్గా గా నిలిచింది. ఆ హోర్డింగ్ లో అనుష్కని చూస్తూ వాహనదారులు చాలామంది యాక్సిడెంట్స్ చేశారట. అలా అని ఒకటి రెండు కాదు ఏకంగా అనుష్క హోర్డింగ్ వల్ల దాదాపు 40 యాక్సిడెంట్ లు అయ్యాయట. దీంతో రెగ్యులర్ యా క్సిడెంట్స్ జరుగుతుండటంతో పోలీసులు ఈ హోర్డింగ్ ను జీహెచ్ఎంసీ సిబ్బందితో తొలగింపజేశారట.

Tags

Next Story