Tollywood : అనుష్క 'ఘాటీ'.. ఫస్ట్ లుక్ విడుదల

టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన స్టార్ నటి అనుష్కశెట్టి. ఎన్నో హిట్ మూవీస్ లో నటించి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరిపోయింది. ఈ రోజు ఈ భామ పుట్టినరోజు. 1981 నవంబర్ 7న మంగళూరులో జన్మించింది అనుష్క. బెంగళూరులో స్టడీస్ పూర్తి చేసి యోగా ట్రైనర్ గా పనిచేసింది. తర్వాత పూరిజగన్నాథ్ డైరెజ్జన్ లో కింగ్ నాగార్జునకు జోడీగా వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది. ఆతర్వాత వచ్చిన విక్రమార్కుడు, అరుంధతి, బాహుబలి లాంటి ఎన్నో మూవీస్ లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్ని సినిమాలు చేసినన కోడి రామకృష్ణ డైరెక్షన్ లో అరుంధతిలో చేసిన జేజమ్మ క్యారెక్టర్ మాత్రం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. తెలుగుతో పాటు తమిళం,
మలయాళంలో పలుచిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఇక బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది అనుష్క. అయితే 42 ఏళ్లు వచ్చినా అనుష్క ఇంకా పెళ్లిచేసుకోలేదు. ఆమె పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. కానీ వాటి పై అనుష్క ఎప్పుడూ స్పందించలేదు. ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ అమ్మడు ఓ తెలుగు మూవీలో, మలయాళ మూవీలో నటిస్తోంది. అలాగే క్రిష్ డైరెక్షన్ లో 'ఘటి' అనే మూవీలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల
ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com