Anushka Shetty : అనుష్క శెట్టి ఘాటీ.. కీలక అప్డేట్

ఫస్ట్ మూవీతోనే తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి అనుష్క శెట్టి. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ.. 'అరుంధతి'తోనే తనకు మంచి గుర్తింపు దక్కింది. ఇక 'బాహుబలి'తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేసిని సంపాదించుకుంది. ప్రస్తుతం స్వీటీ.. దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి డైరెక్షన్లో 'ఘటి' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లేడీ ఓరియెంటెండ్ గా తెరకెక్కుతున్నట్టు తెలు స్తోంది.
ఈ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. తాజాగా ఈసిమానిపై కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పటికే 85 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ క్షన్ వర్క్ కూడా ఆల్ రెడీ మొదలైంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఈ చిత్రం క్లైమాక్స్ ను షూట్ చేయనున్నా రు. స్వీటీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పనున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రం థియేటర్లో విడుదలైన తర్వాత అమెజాన్ ప్రైమ్ స్ట్రీమ్ కానుందని సమాచారం. కాగా ప్రస్తుతం అనుష్క ఈ సినిమాతో పాటు మలయా ళంలో కూడా ఓ సినిమా చేస్తోంది.
వాస్తవానికి అనుష్క శెట్టికి ఇప్పుడు సౌత్‌లో సాలిడ్ హిట్ కావాలి. గత నాలుగేళ్లలో ఆమెకి చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా విమర్శకుల్ని మెప్పించినా.. ఆశించిన మేర వసూళ్లు మాత్రం రాలేదు. దాంతో ఈ ఘాటీపై ఈ ముద్దుగుమ్మ గంపెడాశలు పెట్టుకుంది. మరోవైపు క్రిష్‌కి కూడా ఈ సినిమా హిట్ కావడం చాలా అవసరం. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న హరిహర వీరమల్లు మూవీ సడన్‌గా చేజారింది. దాంతో ఇప్పుడు ఈ ఘాటీతో కమ్ బ్యాక్ చేయాలని క్రిష్ ఆశిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com