Anushka Shresthi : సమ్మర్ లో అనుష్క ఘాటీ

Anushka Shresthi : సమ్మర్ లో అనుష్క ఘాటీ
X

ప్రస్తుతం టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి కోలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తర్వాత క్రిష్ డైరెక్షన్లో ఘాటి మూవీ చేస్తోంది ఈ భామ. సోమల్ డ్రామా నేపథ్యంలో సాగే.. ఈ మూవీ నుంచి ఇప్పటికే ప్రీలుక్ రిలీజైంది. దీంతో ప్రేక్షకుల్లో ఈమూవీపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మూవీని 2025 మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తు న్నారని టాక్. కొద్దిరోజుల్లో దీనిపై అఫీషియల్ అనౌన్స్ రానుందని సమాచారం. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Tags

Next Story