ముద్దుగా పిలిచి ఏమీ లేదంటే ఎలా.. ఫ్యాన్స్ ఒప్పుకోవట్లా..!!

వాళ్లిద్దరి పెయిర్ సిల్వర్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ పైన కూడా చాలా బావుంటుంది.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటుంది అంటూ అభిమానులు తమ కోరికను బాహాటంగానే బయటపెట్టేశారు.. అయినా ఎందుకో అటు అనుష్క కానీ, ఇటు ప్రభాస్ కానీ ఈ విషయంపై స్పందిస్తూ అదేం లేదు అని కొట్టిపారేశారు. దీంతో ఫ్యాన్స్ నిరాశపడిపోయారు. ఆ విషయాన్ని పక్కనపెడితే గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న స్వీటీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అభిమానులను అలరించనుంది.
ఆమె సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులు ఇది కొంత ఊరటనిచ్చే అంశం. మళ్లీ తెరమీద అనుష్కను చూడబోతున్నాం అన్న ఆనందం పట్టలేకపోతున్నారు.. దానికి తగ్గట్టు టీజర్ కూడా సినీ ప్రియులను అలరిస్తోంది.. నటీనటులకు కూడా టీజర్ నచ్చేసింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రభాస్ కూడా మిస్ శెట్టి టీజర్‌కి ఫిదా అయిపోయి చిత్ర యూనిట్‌ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు.. అది చూసి అనుష్క కూడా ప్రభాస్‌ని క్యూట్‌గా నిక్ నేమ్ 'పుప్సూ' అని సంబోధిస్తూ రిప్లై ఇచ్చింది.
ఇది ఆన్‌లైన్ బజ్‌కు కారణమైంది, వారి సంబంధం మళ్లీ పుంజుకుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల, కృతి సనన్, ప్రభాస్ డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. ఇది ఇంటర్నెట్‌లో పాపులర్ టాపిక్‌గా మారింది. అయితే, అనుష్క శెట్టితో అతని స్నేహం ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. కాగా, రామ్ చరణ్ కూడా మిస్ శెట్టి టీజర్ చూసి అనుష్కను, నవీన్ పోలిశెట్టిని అభినంధిస్తూ ట్వీట్ చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com