Anvesh : అన్వేష్ అవే మాటలు.. ఇంక మారవా..?

నా అన్వేషణ అన్వేష్ మీద యావత్ హిందూ సమాజం మొత్తం భగ్గుమంటోంది. ఎందుకంటే అతను ఇండియాను, హిందువులను, హిందూ దేవుళ్లను అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. శివాజీ హీరోయిన్ల బట్టల మీద చేసిన కామెంట్లకు గాను ఇప్పటికే సారీ చెప్పాడు. మహిళా కమిషన్ ముందు హాజరయ్యాడు. అతని వివాదం దాదాపు క్లోజ్ అయిపోయినట్టే. శివాజీ చెప్పింది మంచి ఉద్దేశమే అయినా.. అతను చెప్పిన విధానం కరెక్ట్ కాదు కాబోలు. అయితే దొరికిందే సందు అన్నట్టు ఆడవారి బట్టల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అన్వేష్. ఆడవాళ్లు పబ్లిక్ ప్లేస్ లో బట్టలు విప్పుకుని తిరిగినా తప్పులేదు. చూసే వాడిదే తప్పు అన్నట్టు అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడు. పైగా శివాజీ, గరికపాటి గారిపై అత్యంత దారుణమైన కామెంట్స్ చేశాడు.
ఇక సీతాదేవి, ద్రౌపదిని అత్యంత దారుణంగా అవమానించాడు. దీంతో హిందూ సమాజం మొత్తం ఫైర్ అయింది. ఆయన మీద కంప్లయింట్లు వచ్చాయి. సోషల్ మీడియాలో దారుణంగా తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. లక్షల మంది అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా ఇన్ స్టాలో అతన్ని అన్ ఫాలో చేశారు. దెబ్బకు అన్వేష్ క్షమాపణ అంటూ ఓ వీడియో వదిలాడు. కానీ దాన్ని కూడా సరిగ్గా చెప్పలేదు. నా క్షమాపణ యాక్సెప్ట్ చేయకపోతే మీకు కొత్త సంవత్సరంలో అష్టదరిద్రాలు తగులుకుంటాయి అంటూ తన ఫాలోవర్లకు, హిందూ సమాజానికి శాపనార్ధాలు పెడుతున్నాడు. అన్వేష్ కు నిజంగా సారీ చెప్పే ఉద్దేశమే కనిపించట్లేదు.
కొత్త సంవత్సరంలో ఎవరైనా బాగుండాలి అని కోరుకుంటారు. ఇలా నాశనం అయిపోవాలని ఎవరైనా కోరుకుంటారా. దీన్ని ఏమనాలి అసలు. అతనికి ఇండియా మీద కనీస గౌరవం లేదు. ఎంతసేపు ఇండియాను తిడుతూ వీడియోలు చేస్తున్నాడు. థాయ్ లాండ్ గొప్పదని.. ఇండియాలో రేప్ లు ఎక్కువగా జరుగుతాయని అంటున్నాడు. థాయ్ లాండ్ జనాభా ప్రకారం ఇండియా కంటే తక్కువే కావచ్చు. కానీ రేషియో అక్కడే ఎక్కువగా ఉంది. అది అన్వేష్ కు తెలియదేమో. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మరి పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

