pawan: అల్లు అర్జున్‌పై పవన్ సంచలన వ్యాఖ్యలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారని అన్నారు. అభిమాని మరణించిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాల్సిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాస్త సున్నితంగా వ్యవహరిస్తే బాగుండేదని, చట్టం ఎవరిని విడివిడిగా చూడదని పవన్ అన్నారు. ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ స్పందిస్తే బాగుండేదన్నారు.
అల్లు అర్జున్‌ను ఒంటరి చేసేశారు
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను ఒంటరి చేసేశారని, అతడిని దోషిగా నిలబెట్టారని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ఇది సమంజసం కాదన్నారు. ఈ ఘటనలో అందరూ కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేదన్నారు. అల్లు అర్జున్ కాకపోయినా కనీసం ఆయన సిబ్బంది అయినా రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తే సబబుగా ఉండేదని, అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకూ ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డిని తప్పు పట్టలేం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో రేవంత్ ని తప్పు పట్టలేమని అన్నారు. సినిమా విషయంలో రేవంత్ చాలా ప్రోత్సాహం ఇచ్చారన్నారు. బెనిఫిట్ షో అనుమతి, టికెట్లు రేట్లు పెంచడం కూడా సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమేనని అన్నారు. రేవంత్ పేరు చెప్పలేదని ఇదంతా చేశారని తాను అనుకోవడం లేదని వెల్లడించారు. అలా చేయకపోతే రేవంత్ పై ప్రజాగ్రహం వచ్చేదని పవన్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com