AP Govt vs Tollywood: స్టార్ హీరోలపై జగన్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష..??

AP Govt vs Tollywood: స్టార్ హీరోలపై జగన్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష..??
AP Govt vs Tollywood: ముఖ్యమంత్రులు వస్తుంటారు.. పోతుంటారు.. తారలనే వాళ్లు దశాబ్దాలుగా పాతుకుపోతుంటారు.

AP Govt vs Tollywood: ముఖ్యమంత్రులు వస్తుంటారు.. పోతుంటారు.. తారలనే వాళ్లు దశాబ్దాలుగా పాతుకుపోతుంటారు. అందుకే.. మన కథానాయకుల ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. తమ అభిమాన కథానాయకుల కోసం ఎలాంటి సాహసాలు చేయడానికైనా సిద్ధపడిపోతుంటారు అభిమానులు. ఇక మన తెలుగు సినీ ఇండస్ట్రీకి, రాజకీయాలకు మధ్య విడదీయరాని బంధం ఉంది. భారతదేశంలో ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో సత్తా చాటారు. మరీ ముఖ్యంగా దక్షిణాది నుంచి కరుణానిధి, ఎమ్.జి.ఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి సినీ ప్రముఖులు ముఖ్యమంత్రులుగా పనిచేసి తాము కేవలం సిల్వర్ స్క్రీన్ డెమీ గాడ్స్ మాత్రమే కాదని పాలిటిక్స్ లోనూ పవర్ చాటుతామని నిరూపించారు. అందుకే.. సినీ నటులను కేవలం జనాన్ని పోగేసే గ్లామర్ డాల్స్ లా లెక్కేయడానికి లేదు. వాళ్లు తలుచుకుంటే పరిపాలకులుగానూ పవర్ చాటుతారని పైన ఎగ్జాంఫుల్స్‌ను ఉదహరిస్తుంటారు.




తెలుగు నేల విషయానికొస్తే పార్టీ ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే పరిపాలకుడిగా బాధ్యతలు స్వీకరించిన ఘన చరిత్ర విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుది. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సినీ నటులకు గౌరవం తగ్గుతోందా? అంటే ఔననే సమాధానం వస్తుంది. కోవిడ్‌తో కుదేలైన చిత్ర పరిశ్రమను మళ్లీ గాడిన పడేయడానికి చిత్ర ప్రముఖులంతా కలిసి టిక్కెట్ రేట్స్ పెంచమని ఎపి ప్రభుత్వాన్ని అర్థించారు. ఆ సమయంలో ఎపి గవర్నమెంట్ చేసిన హైడ్రామా అంతా ఇంతా కాదు. టాలీవుడ్ స్టార్స్ అందరినీ తన వద్దకు పిలిపించుకున్న సిఎమ్ వారికి ఎలాంటి గౌరవం ఇచ్చారో తెలిసిందే.



చివరకు ఆ అంకం ముగిసింది.. గతంలో ఏ ప్రభుత్వమూ సినీ ఇండస్ట్రీపై పెద్దగా కక్ష పెంచుకున్న సందర్భం తెలుగు చరిత్రలో లేదు. కానీ.. నేటి ప్రభుత్వం మాత్రం చిత్ర పరిశ్రమను బాగా ఇబ్బంది పెడుతోంది. కొంతమంది హీరోలను టార్గెట్ చేసి వాళ్ల ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతీస్తుంది. మొన్నటివరకూ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం పొందిన ప్రభుత్వం.. ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి అభిమానుల ఆగ్రహాన్ని చూసే సందర్భం వచ్చింది.. రాజకీయాలు వేరు సినిమాలు వేరు. కానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాలను రాజకీయాలతో ముడిపెడుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల టిక్కెట్స్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు తేటతెల్లమే.


ఇప్పుడు నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగా స్టార్ చిరంజీవి సినిమాలకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. స్టార్ హీరో సినిమా ఫంక్షన్ అంటేనే అభిమానులకు పెద్ద పండగ. అలాంటి పండుగ వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. నేడు ఒంగోలులో జరగనున్న వీర సింహ రెడ్డి ప్రీ రిలీజ్‌కి భారీగా ఆంక్షలు విధించింది. అలాగే విశాఖలో ఆదివారం జరగనున్న మెగా స్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాలకు తొలుత ఖరారు చేసుకున్న వేదికను చివరి క్షణంలో మార్పించింది.


అనుక్షణం ఈవెంట్ ఆపే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు? సినీ రంగంలో మొట్ట మొదటి సారిగా ఒక ఆడియో ఫంక్షన్‌కి పోలీసులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం కూడా చిత్ర వర్గాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో పాతుకుపోయిన సినీ ఇండస్ట్రీను ఆంధ్రప్రదేశ్‌కి తీసుకురావాలని ప్రభుత్వం పట్టుబట్టడంలో అర్థం ఉంది. అయితే.. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతుంది? నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఎలాంటి హామీలు ఇస్తోంది? అనడంలో ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే చిత్ర పరిశ్రమకు కూడా ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అవుదామని ఉన్నా? ప్రభుత్వ తీరుతో వాళ్లు కూడా విసిగిపోతున్నారు. ఇలా హీరోలను, వాళ్ల ఫ్యాన్స్‌ను ఇబ్బందిపెడితే.. మునుముందు ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ ఎదిగే అవకాశం ఉందా? అనేది సినీ విశ్లేషకుల మాట.

Y.J. Rambabu

Entertainment Editor

Tags

Read MoreRead Less
Next Story