Jr NTR : సీఎం రేవంత్ కు క్షమాపణలు..తారక్ స్పెషల్ వీడియో..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులకు. ముందుకు రానుంది. ఈ క్రమంలో నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ వేడుక అనంతరం తారక్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి ఆయన క్షమాపణలు తెలియ జేశారు.
కాగా వేదిక పై సినిమా గురించి, హృతిక్ గురించి మాట్లాడిన తారక్ తాను స్పీచ్ లో ఒక విషయం మర్చిపోయానని ..తనను క్షమించాలి అని కోరారు. ఈ ఈవెంట్ ఇంత గొప్పగా, సజావుగా జరగడానికి సహాకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యత తీసుకొని తన ఫ్యాన్స్ ఆనందానికి కారణం అయ్యారని ప్రభుత్వాన్ని తారక్ కొనియాడారు. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com