Kalki 2898 AD : ప్రభాస్ ను కల్కికి దూరం చేస్తున్నారా..

ఓ వైపు ఇండియాస్ టాప్ హీరోగా ప్రేక్షకులు చెబుతున్నారు. మరోవైపు తెలుగు వాళ్లే ప్రభాస్ వల్ల కల్కి హిట్ కాలేదు అనే ప్రచారం చేస్తున్నారు. ఈ రెండిటినీ ఖచ్చితంగా చూస్తే కల్కి విజయంలో ప్రభాస్ పాత్రేం లేదు అనే ప్రచారం బలంగా కనిపిస్తోంది. ఇది సినిమా రిలీజ్ అయిన రోజు నుంచీ వినిపిస్తోంది. కొందరు పనికట్టుకుని మరీ ఆ ప్రచారం చేస్తున్నారు అనేద వాస్తవం. అయితే దీనికి పునాది పడింది మాత్రం నిర్మాత అశ్వనీదత్ యధాలాపంగా చెప్పిన మాటలే కావడం విశేషం. రిలీజ్ తర్వాత ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం అమితాబ్ బచ్చన్ అన్నాడాయన. అంతే అప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అలిగారు. ఇదే అదనుగా మిగతా వాళ్లు రెచ్చిపోతున్నారు. అసలు ఈ మూవీలో ప్రభాసే విలన్ అనేంత వరకూ వచ్చారు కొందరు. చివర్లో కర్ణ ఎపిసోడ్ లేకపోతే ప్రభాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయేవాడు అంటూ మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా మహా భారతంలో అర్జునుడే హీరో కదా.. అలాంటప్పుడు మవోడు గొప్ప కానీ కర్ణుడి పాత్ర చేసిన ప్రభాస్ ఎలా గొప్ప అవుతాడు అని సందట్లో సడేమియా కామెంటుతున్నారు.
ఫైనల్ గా అంతా కలిసి దర్శకుడి ఖాతాలోనే ఈ విజయాన్ని వేస్తున్నారు. అది నిజమే అయినా.. ఈ మూవీకి ఓపెనింగ్స్ వచ్చిందీ.. దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది కేవలం ప్రభాస్ వల్లే అనేది కాదనలేని సత్యం. ఎంత గొప్ప కథ చెప్పాలని ప్రయత్నించినా.. నాగ్ అశ్విన్ ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు అంతకు ముందు అస్సలు తెలియదు. ఓపెనింగ్స్ తెచ్చే సత్తా అమితాబ్, దీపికా పదుకోణ్ లకు లేదు. కేవలం డార్లింగ్ ను చూసే ఓపెనింగ్స్ వచ్చాయనేది ఆయన ఫ్యాన్స్ వాదన. మొత్తంగా ఈ గొడవంతా చూస్తోంటే కల్కి విజయంలో ప్రభాస్ పాత్ర పెద్దగా లేదు. రాబోయే పార్ట్ కూడా కేవలం కమల్ హాసన్ ప్రధానంగా సాగుతుందనే వాళ్లూ లేకపోలేదు. మరి దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ ఎవరి వల్ల పడుతుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com