Prabhas Salar : ప్రభాస్ సలార్ పై రూమర్స్ నిజమేనా..?

Prabhas Salar :  ప్రభాస్ సలార్ పై రూమర్స్ నిజమేనా..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ సైలెంట్ బ్లాక్ బస్టర్ సలార్ మూవీ కూడా రెండు భాగాలుగా వస్తుందని చెప్పాడు ప్రశాంత్ నీల్. సలార్ మరీ ఆశించినంత గొప్పగా లేకపోయినా ప్రభాస్ కటౌట్ వల్ల కలెక్షన్ల వర్షం కురిసింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత తక్కువ డైలాగ్స్ ఉన్న మూవీ ఇది. కనీసం పది పేజీల డైలాగ్స్ కూడా లేవేమో అనుకున్నారు అప్పుడు. అంత తక్కువ డైలాగ్స్ ఉన్నా.. అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో గూస్ బంప్స్ తెప్పించాడు దర్శకుడు.

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మిగతా మూవీస్ అన్నీ నానా హడావిడీ చేశాయి. బట్ సలార్ మూవీ టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. రాజా సాబ్ నుంచి కొత్త పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇతర ప్రాజెక్ట్స్ నుంచి హ్యాపీ బర్త్ డే అనే పోస్టర్స్ పడ్డాయి. అలాగే సలార్ నుంచి సెకండ్ పార్ట్ పై ఏదైనా కొత్త వార్త వస్తుందేమో అని ఎదురుచూశారు అభిమానులు. కానీ వారిని పూర్తిగా నిరాశపరిచారు. అసలు కొన్నాళ్ల క్రితం ఈ మూవీకి సీక్వెల్ ఉండదు అనే రూమర్స్ కూడా వచ్చాయి. ఇలాంటి బర్త్ డే సందర్భాల్లో కూడా అలాంటి అప్డేట్ లేదు అంటే ఈ రూమర్స్ నిజం అనే అనుకోవాలేమో. అందుకు ప్రభాస్ లైనప్ కూడా సపోర్ట్ చేస్తోందిప్పుడు.

రాజా సాబ్ తర్వాత ఫౌజీ, స్పిరిట్ సినిమాలు వరుసగా ఉన్నాయి. వీటి తర్వాత సలార్ 2 ఉంటుందా లేక మధ్యలో ఉంటుందా అనే కన్ఫ్యూజన్స్ చాలానే ఉన్నాయి. అదే టైమ్ లో సలార్ 2కు సంబంధించి చాలా షూటింగ్ అయిపోయింది. కొంత పార్టే బ్యాలన్స్ ఉందనే న్యూస్ కూడా ఉన్నాయి. అదే నిజమైతే ప్రభాస్ మరీ ఎక్కువ రోజులు ఈ చిత్రానికి కేటాయించాల్సిన అవసరం లేదు. ఏదేమైనా అసలు సలార్ 2 ఉంటుందా లేదా అనే క్లారిటీ లేదా అప్డేట్ ఏదైనా బర్త్ డే సందర్భంగా వచ్చి ఉంటే బావుండేదేమో.

Tags

Next Story