Seetha Payanam Teaser : అర్జున్ సర్జా సీతాపయనం టీజర్ రిలీజ్

అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సీతా పయనం. ఈ మూవీలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. అర్జున్ కుమార్తెకు ఇది హీరోయిన్గా తొలి సినిమా. మరోవైపు హీరోగా ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర సోదరుడి కుమారుడు నిరంజన్ సుధీంద్ర నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇది ఓ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటోంది. హీరోయిన్ చేసే కార్ జర్నీలో హీరో పరిచయం కావడం, ఆ పరిచయం ప్రేమగా మారడం, ఆ ప్రేమలో వారు ఎదుర్కొనే సంఘర్ష ణలు కథలో ప్రధానాంశంగా ఉండనున్నాయని టీజర్ లోఅర్థమవుతోంది. ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. సత్యరాజ్, ప్రకాశ్ రాజ్, కోవై సరళ, బిత్తిరి సత్తి, సిరి హనుమంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే అర్జున్ సర్జా, ధృవ్ సర్జాలు గెస్ట్ రోల్స్ లో మెరవనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com