Tollywood : అర్జున్ సర్కార్ ఆన్ డ్యూటీ

గతేడాది 'సరిపోదా శనివారం' మూవీతో సాలీడ్ హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం హిట్ 3. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'హిట్: ది థర్డ్స్'లో నాని పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో అర్జున్ సర్కార్గా కని పించనున్నారు. మే 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ పాటు గ్లింప్ ను విడుదల చేసింది. కాగా.. ఇవాళ నాని బర్త్ డే సందర్భంగా టీమ్ 'హిట్ 3' టీజర్ను రిలీజ్ చేసింది. ఇందులోని బీజీఎం, డైలాగ్స్, నాని యాక్టింగ్ ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. శ్రీనగర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. వరుస హత్యలు, అర్జున్ సర్కార్ వాటిని ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. ఇప్పటి వరకు మృదువైన ఫ్యామిలీ మ్యాన్ పాత్రలతో ఆకట్టుకున్న నాని, ఈ సినిమాలో పూర్తిగా రెబల్ లుక్లో కనిపించబోతుండడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com