Arjun Sarkar : లాఠీ పట్టిన అర్జున్ సర్కార్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ' హిట్ ': ద థర్డ్ కేస్. శైలేష్ కొలను దర్శకుడు. హిట్ సినిమాల సిరీస్ లో మూడవ భాగంగా రాబోతోంది. వాల్ పోస్టర్ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా టీజర్ విడుదల చేశారు. పోలీసులను కలవరపెట్టే వరుస రహస్య హత్యల నేపథ్యంలో టీజర్ ప్రారంభమవుతుంది. ఎంత ప్రయత్నించినా హంతకుడిని పట్టుకోవడంలో విఫలమవుతారు. చివరగా బ్రూటల్ ఇన్వెస్టిగేటర్ అర్జున్ సర్కార్ ను ఆశ్రయిస్తారు. ఈ పాత్రని నాని పోషిస్తున్నారు. ఆయన కనికరం లేని పాత్రలో కనిపిస్తారు. ఆ తర్వాత జరిగేదేమిటనేది తెలుసుకోవాలంటే సినిమా వీక్షించాల్సిందే. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహమం, మిక్కీ జే మేయర్ సంగీతం ఆకట్టుకుంటాయి. మే ఒకటవ తేదీన ఈ సినిమా విడుదలకానుంది. శ్రీనిధి శెట్టి కథానాయిక.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com