Bigg Boss : బామ్మ గెటప్ లో బిగ్ బాస్ భామ

Bigg Boss : బామ్మ గెటప్ లో బిగ్ బాస్ భామ
X

గ్లామర్, అందాల ఆరబోతతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే అషురెడ్డి సడన్ గా బామ్మగా మారిపోయింది. నితిన్ హీరోగా మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటించిన 'ఛల్ మోహన్ రంగ' సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న అషురెడ్డికి ఆ తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అలా అక్కడ తన ఆటతో ఆకట్టుకున్నప్పటికీ ఫైనల్ వరకు వెళ్లలేకపో యింది. ఇక హౌస్ నుంచి బయటికి వచ్చాక బుల్లితెరపై రియాల్టీ షోలు చేస్తూ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత డైరెక్టర్ ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మకు సం బంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆషు రెడ్డి తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో లో బామ్మా గెటప్లో రెడీ అయి ఫొటోస్ కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అషు రెడ్డి పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు నీ నేచురల్ లుక్ ఇదేగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ షో కోసమే ఇలా బామ్మ గెటప్ వేసినట్లుగా తెలుస్తోంది.

Tags

Next Story